ఆ విషయంలో Pavitri Lokeshకు బిగ్‌షాక్.. అసలేం జరిగిందంటే..
లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో, విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్గా పవిత్రకు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే.. ఆమె కొన్ని వారాల క్రితం పీహెచ్డీ చేసేందుకు బళ్లారిలోని
దిశ, సినిమా: లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో, విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్గా పవిత్రకు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే.. ఆమె కొన్ని వారాల క్రితం పీహెచ్డీ చేసేందుకు బళ్లారిలోని హంపీ కన్నడ యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. అయితే కన్నడ భాషా సాహిత్యంలో పట్టా సాధించాలన్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తీర్ణత అయితే సాధించింది కానీ సీటు పొందేందుకు సరిపడా ర్యాంక్ మాత్రం రాలేదట. దీంతో అర్హత సాధించిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌లో పవిత్ర పేరు లేకపోవడంతో తన మాతృ భాషా సాహిత్యంలో పీహెచ్డీ చేయాలన్న కల ఇక నెరవేరదని బాధ పడుతోందట. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతోంది.