Naga Chaitanya: ఎంగేజ్మెంట్ అయిన 10 రోజులకే చైతుకు బిగ్ షాక్.. ‘తండేల్’ కు వచ్చిన కొత్త తలనొప్పి?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Update: 2024-08-18 09:24 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో నటించి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. వీరిద్దరు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ప్రేమలో ఉండి పెద్దలను ఒప్పించి మరీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్ల పాటు కాపురం చేసిన తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక డైవర్స్ తర్వాత ఎవరి లైఫ్ వారు చేసుకుంటున్నారు. అయితే సమంత మయోసైటీస్ బారిన పడి సినిమా ఇండస్ట్రీకి దూరం అయిన విషయం తెలిసిందే. ఇక చైతన్య మాత్రం సినిమాలు చేస్తున్నాడు. ఇక చైతు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ క్రమంలో నాగచైతన్య, యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళతో ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

ఈ విషయాన్ని ఆయన తండ్రి నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక వీరిద్దరు గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం కూడా బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ చైతు నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఇది గీతా ఆర్ట్స్- బ్యానర్‌పై తెరకెక్కుతోంది. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తండేల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే చైతు సినిమాల విషయానికొస్తే ఎలాగైనా తండేల్ హిట్ కొడితేనే ట్రాక్‌లోకి వస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొత్త తలనొప్పి వచ్చినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్‌ 6తేదీన అల్లు అర్జున్ పుష్ప-2 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాను కూడా డిసెంబర్‌లోనే విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలు విడుదల అయితే చైతు మూవీని రిలీజ్ చేస్తే హిట్ అవడం కష్టం. కాబట్టి తండేల్ వెనక్కి తగ్గుతుందా లేక.. రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఎంగేజ్మెంట్ అయిన 10 రోజుల్లోనే ఆయనకు కొత్త తలనొప్పి వచ్చి షాక్ తగిలినట్లు అయిందని అభిప్రాయ పడుతున్నారు.

Tags:    

Similar News