మెగాస్టార్‌కు భారీ షాక్.. ఇంట్రస్ట్ చూపని డిస్ట్రిబ్యూటర్స్..

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అవసరం..

Update: 2022-09-18 09:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అవసరం లేదు. అతడి సినిమాలంటే కొనేందుకు డిస్ట్రీబ్యూటర్లు క్యూలు కడతారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే సినిమా థియేటర్ల దగ్గర పరిస్థితి జాతర్లను తలపిస్తుంది. అయితే తాజాగా మెగాస్టార్‌కు డ్రిస్ట్రిబ్యూటర్లు భారీ షాకిస్తున్నారు.

భారీ అంచనాలతో చిత్రీకరించబడిన చిరు సరికొత్త సినిమా గాడ్ ఫాదర్‌ను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదట. అయితే చిరంజీవి కెరీర్‌లో 'ఆచార్య' పెద్ద దెబ్బనే చెప్పుకొవాలి. కొరటాల శివ దర్శకత్వంలో చిరు తెరకెక్కించిన 'ఆచార్య' సినిమా భారీ నెగిటివ్ టాక్ ఎదుర్కొంది. దానికి తోడుగా చిరంజీవి కొంతకాలంగా సరైన స్క్రిప్ట్‌లను కూడా ఎంచుకోవడం లేదని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో ప్రస్తుతం చిరు హీరోగా రానున్న 'గాడ్ ఫాదర్' సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాను చెప్పిన మొత్తానికి కొనేందుకు ఆసక్తి చూపడం లేదని, విడుదలకు అతి కొద్ది వారాలే దూరంగా ఉండగా ఈ పరిణామం చిత్ర యూనిట్‌కు భారీ చేదు అనుభవం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నిర్మాతలు సినిమాను రూ.85 కోట్లకు అమ్మేందుకు రేట్ ఫిక్స్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఈ సినిమాకు అంత ఇచ్చేందుకకు సిద్ధంగా లేరని టాక్ నడుస్తోంది. అయితే చిరంజీవి కెరీర్‌లో తన సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read : మెగాస్టార్‌కు భారీ షాక్.. ఇంట్రస్ట్ చూపని డిస్ట్రిబ్యూటర్స్..

Also Read : 'శాకుంతలం'నుంచి దేవ్ మోహన్ ఫస్ట్‌లుక్.. ఫ్యాన్స్ ఫిదా 


Similar News