Bichagadu 2: ‘బిచ్చగాడు 2’ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా?
2016లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం ‘బిచ్చగాడు’.
దిశ, సినిమా: 2016లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం ‘బిచ్చగాడు’. ఇక తాజాగా దీనికి సీక్వెల్‌గా ‘‘బిచ్చగాడు2’ నిన్ననే తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్ విషయంలో మాత్రం ఈ మూవీ దుమ్ము లేపింది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో ఎక్కడ చూసినా థియేటర్స్ నిండిపోయాయి. ఇక కలెక్షన్‌ల గురించి మాట్లాడుకుంటే.. తెలుగు రాష్ర్టాల నుంచి ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం రూ. 2 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిన క్లీన్ హిట్ కావాలంటే రూ.6 కోట్ల 50 లక్షల షేర్ వసూళ్లను రాబట్టాలి. కాగా మరో వీక్ ఎండ్‌లో రాబట్టే అవకాశం కనిపిస్తోంది.