Bhagyasre Borse: పవన్ కల్యాణ్‌తో లిఫ్ట్‌లో అలా చేయాలని ఉంది.. యంగ్ బ్యూటీ నోట పచ్చి బూతు.. వైరల్ అవుతున్న కామెంట్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్‘.

Update: 2024-08-14 07:16 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్‘. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆగష్టు 15న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతోనే యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్స్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే తాజాగా అరియానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'దావత్' షోకు గెస్టుగా ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. అరియానా ప్రశ్నలకు ఆమె చెప్పిన ఫన్నీ సమాధానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇంటర్వ్యూలో భాగంగా.. యాంకర్ అరియానా ‘‘ఒకవేళ మీరు లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే.. ఏ హీరో పక్కన ఉంటే బాగుంటుంది?” అని భాగ్యశ్రీని క్వశ్చన్ చేసింది. దానికి భాగ్యశ్రీ ఏమాత్రం తడుముకోకుండా ‘పీకే సర్‌తో’ అంటూ సమాధానం చెప్పింది. దీంతో “డిప్యూటీ సీఎం గారి కొత్త తాలూకా” అంటూ అరియానా ఫన్ క్రియేట్ చేసింది. అలాగే ఏ హీరోతో షాపింగ్ చేయాలనుంది? అనే ప్రశ్న అడగ్గా.. “డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. షాపింగ్ చేస్తాను” అని చెప్పింది. ఇక తెలుగులో నేర్చుకున్న బూతు పదం ఏంటో చెప్పాలని అడగ్గా.. ‘దొంగ ముం*’ అని చెప్పడంతో అరియానా షాక్ అయ్యింది. ఇలా మొత్తంగా ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ మాత్రం ఆగస్టు 15 నాడు అందుబాటులోకి రానుంది.

కాగా ఈ షో తొలి సీజన్ రీసెంట్‌గా అయిపోయింది. తొలి సీజన్‌కు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో నిర్వాహకులు సెకండ్ సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే, ఈ సీజన్‌కు రీతూ స్థానంలో హోస్టుగా హాట్ బ్యూటీ అరియానా గ్లోరీని తీసుకొచ్చారు.

Read More.. 

Hardik Pandya: నటాషాతో విడాకులు.. ఆ స్టార్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. వైరల్ అవుతున్న పోస్ట్ 


Full View

(video link credits to PMF entertainment youtube channel)

Tags:    

Similar News