"బిఫోర్ మ్యారేజ్’.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. ధరణి కథ తెలుసుకోవాల్సిందే!
ధరణి పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది.
దిశ, సినిమా: భరత్, నవీనరెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బిఫోర్ మ్యారేజ్’. ఈ మూవీ జనవరి 26 న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయం అవుతూ.. ‘బిఫోర్ మ్యారేజ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహించారు.
తెలుగులో ఫిమేల్ లీడ్ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఓ సోషల్ మెసేజ్‌ని ‘బిఫోర్ మ్యారేజ్’ మూవీలో చక్కగా చూపించారు. ఒక సాధారణ అమ్మాయి జీవితాన్ని ఈ సినిమాలో బాగా చిత్రీకరించారు. పెళ్లికి ముందు తప్పుకాదనిపించే పొరపాటు వాళ్ల జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నదనే విషయాన్ని అర్ధం అయ్యేలా బాగా చూపించారు. ఇక సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. ధరణి చదువుకోవడానికి సిటీకి వెళ్తుంది. ఆమె తన స్నేహితులు శాంతి, ప్రశాంతిలతో కలిసి ఒకే రూమ్ లో ఉంటుంది. సిటీ కల్చర్ కి అలవాటు పడి తన స్నేహితుల వల్ల చెడు అలవాట్లకు బానిస అవుతుంది. ధరణి పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. పెళ్లి కాకుండానే తల్లి అయిన ధరణి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నది అన్నదే మిగిలిన కథ.
ధరణి పాత్రలో నటించిన నవీన రెడ్డి ప్రేక్షకులతో మంచి మార్కులు వేపించుకుంది. హీరో భరత్ కూడా అందర్ని మెప్పించాడు. అపూర్వ మరో కీలక పాత్ర పోషించింది. గాయని మంగ్లీ పాడిన పాట సినిమాకు హైలైట్‌గా నిలిచింది. పెళ్లికి ముందు చేయకూడని తప్పు వల్ల జీవితంలో ఎలాంటి కష్టాలు పడ్డాయో వాస్తవికంగా చిత్రీకరించారు. చిన్న సినిమానే అయినా యూత్‌ని ఆకట్టుకునేలా మంచి ప్రయత్నం చేసారు.