విజయ్ మైక్ అలా పట్టుకోవడానికి కారణం బిర్యానీ అన్న చిన్నారి.. హీరో రిప్లైకు నెటిజన్లు ఫిదా!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

Update: 2024-07-03 09:30 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ రౌడీ బాయ్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నటించిన గీత గోవిందం, ఖుషి వంటి మూవీస్ హిట్ సాధించిడంతో విజయ్‌కి అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ దక్కింది. అయితే రౌడీ బాయ్ ఇటీవల నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ గెస్ట్ రోల్ చేశాడు. అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ మైక్ పట్టుకునే తీరుపై ఆర్య అనే చిన్నారి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. దానికి విజయ్ దేవరకొండ స్పందించి అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. ఆర్య అనే అమ్మాయి తన తండ్రిని అందరూ మైక్‌కు ఒక స్టైల్లో పట్టుకుంటే.. విజయ్ దేవరకొండ మాత్రం వెరైటీగా పట్టుకుంటారు ఎందుకు అని అడగ్గా.. దానికి అతను ఏమో తల్లి నాకు తెలియదు అని చెప్తాడు. కానీ ఆ పాప మాత్రం ఎందుకో నేను చెప్తాను. విజయ్‌కి బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి అలా పట్టుకుంటారు అని అంటుంది.

దీంతో ఆర్య ఫాదర్ బిర్యానీ అంటే ఇష్టం ఉంటే అలా పట్టుకుంటారా.. అని అనడంతో అవును లెగ్ పీస్‌ను అలాగే తింటారు కదా అంటుంది. ప్రస్తుతం ఆ చిన్నారి కామెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వీడియోపై విజయ్ దేవరకొండ స్పందించాడు.. ‘‘ అవును ఆర్య నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ మైక్‌ను అలా ఎందుకు పట్టుకుంటానో నాకే తెలియదు. బహుశా నాకు అడ్డంగా ఉండకుండా.. కంఫర్టబుల్‌గా ఉంటుందని అలా పట్టుకుంటాను కావొచ్చు. నీకు బిగ్ హగ్స్ లవ్ యు ఆర్య’’ అని రాసుకొచ్చాడు. ఇక అది చూసిన నెటిజన్లు ఫైనల్లీ ఆర్య పాపకి రిప్లై వచ్చింది బంగారం అన్నా అని అంటున్నారు.

 

Full View


Similar News