గర్ల్ ఫ్రెండ్‌కు కాల్ చేయగా.. తండ్రి దగ్గర అడ్డంగా దొరికిపోయిన హీరో..

హిందీ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌‌కమింగ్ ఫిల్మ్ ‘డ్రీమ్ గర్ల్ 2’

Update: 2023-08-11 09:57 GMT

దిశ, సినిమా : హిందీ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌‌కమింగ్ ఫిల్మ్ ‘డ్రీమ్ గర్ల్ 2’ ప్రిపరేషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు హీరో ఆయుష్మాన్ ఖురానా. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఆయన.. రేడీయో జాకీగా చేసిన వర్క్, థియేటర్ ఆర్టిస్ట్‌గా చేసిన అనుభవం ఈ పాత్రలో జీవించేందుకు హెల్ప్ చేశాయని చెప్పుకొచ్చాడు. అయితే ఆర్జేగా పనిచేస్తున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్‌కు కాల్ చేసే వాడినని.. ఒకవేళ వాళ్ల ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మాయిలాగా మాట్లాడి కవర్ చేసేవాడినని తెలిపాడు. కానీ ఆ తర్వాత ఫోన్ చేసేది ఎవరో అతనికి అర్థమైందని నవ్వేశాడు. ఇక రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్న ‘డ్రీమ్ గర్ల్ 2’ ఆగస్టు 25న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ జోరు పెంచేసింది మూవీ యూనిట్.

Read More:    ‘భోళా శంకర్’ లో శ్రీముఖితో ఆ సీన్ (వీడియో).. రజినీ కాంత్‌ను చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

Tags:    

Similar News