అతివలను ఆశ్చర్యపరుస్తున్న అతియా లెహంగా ప్రత్యేకతలు.. ఏంటో తెలుసా?

బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి జనవరి 23న ఘనంగా జరిగింది.

Update: 2023-01-25 07:31 GMT
అతివలను ఆశ్చర్యపరుస్తున్న అతియా లెహంగా ప్రత్యేకతలు.. ఏంటో తెలుసా?
  • whatsapp icon

దిశ, సినిమా : బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి జనవరి 23న ఘనంగా జరిగింది. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే అతియా శెట్టి ధరించిన లెహంగా అందరినీ ఆకట్టుకోగా దాని తయారీకి పట్టిన సమయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు డిజైనర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. 'అతియా చాలా అందమైన అమ్మాయి. ఆమెను మరింత బ్యూటిఫుల్ వధువుగా చూపించేందుకు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాం. అందులో భాగంగానే లెహంగాను ప్రత్యేకంగా తయారుచేశాం. దాదాపు పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం. మా కష్టానికి తగ్గట్లుగా ఆమె ఈ దుస్తుల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది' అని డిజైనర్ అనామిక చెప్పుకొచ్చింది. ఇక ఈ వివాహ వేడుక అతికొద్ది మంది సన్నిహితుల నడుమ.. మహారాష్ట్రలోని ఖండాలలో ఉన్న సునీల్‌శెట్టి ఫామ్ హౌజ్‌లో జ‌రిగింది.

ఇవి కూడా చదవండి : అతనితో 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న Keerthy Suresh.. ట్వీట్ వైరల్

Tags:    

Similar News