17 ఏళ్ల వయస్సులోనే బికినీ వేసుకొని ఆ పని చేయాలని అడిగారు.. టీవీ షో నటి షాకింగ్ కామెంట్స్

సినిమా ఓ కళ కావచ్చు కానీ.. సినీ ఇండస్ట్రీ మాత్రం ఓ రంగుల ప్రపంచం. ఇందులోకి ప్రవేశించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అయినా కొందరే సాకారం చేసుకుంటారు.

Update: 2024-05-28 06:27 GMT

దిశ, సినిమా : సినిమా ఓ కళ కావచ్చు కానీ.. సినీ ఇండస్ట్రీ మాత్రం ఓ రంగుల ప్రపంచం. ఇందులోకి ప్రవేశించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అయినా కొందరే సాకారం చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు మీరు ఊహించినంత ఈజీగా ఉండవు. ఒక్కసారి అడుగు పెట్టాక అందరికీ అనుకూలమైన వెదర్ ఉండకపోవచ్చు. దీంతో అవకాశాల కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి కొందరికి ఎదురవుతూ ఉంటుంది.

సినీ రంగం అనే కాదు, టెలివిజన్ రంగంలోనూ చేదు అనుభవాలను ఎదుర్కొన్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఓ టీవీ నటి తాను ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 17 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడే తనకు మంచి ఆఫర్ వచ్చిందని, అయితే ఆ సమయంలో తనను బికినీ వేసుకొని కెమెరా ముందుకు రావాలని అడిగారంటూ కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు. చాలా కాలంగా నడుస్తున్న హిందీ టీవీ షో అయిన ‘కుంకుమ్-ఏక్ ప్యారా సా బంధన్‌’లో కుంకుమ్ పాత్ర పోషించిన జూహీ పర్మాన్.

దాదాపు ఏండేండ్లుగా నడుస్తున్న ఈ షోలో నటించిన జూహీ తన నటనతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మొదటిసారి కెమెరా ముందుకు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అలాగే తన 18 ఏండ్ల వయస్సులో కూడా ఓ టీవీ షో హెడ్ మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్‌లో ఆఫర్ ఇచ్చాడని, ఈ సందర్భంగా కూడా బికినీ ధరించి రావాలని పరోక్షంగా కమిట్మెంట్ అడిగాడని, అయినా తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత కూడా గ్లామర్ ఫీల్డులో నిలదొక్కుకోవాలంటే ‘కాంప్రమైజ్’ అవ్వాలని కొందరు కాస్టింగ్ కౌచ్‌ గురించి ఒప్పించే ప్రయత్నం చేసినా తాను తగ్గలేదని వెల్లడించింది. చివరికి ఎంతో కష్టపడి టీవీ షోలలో నిలదొక్కుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా జూహీ పర్మాన్ గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Read More..

పెళ్లైన మూడు నెలలకే భర్తతో నటి విడాకులు?.. దాని గురించి మాట్లాడదలుచుకోలేదంటూ షాకింగ్ పోస్ట్ 


Similar News