PAWAN KALYAN: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌కు ప్రాణ గండం.. సంచలన విషయం బయటపెట్టిన జ్యోతిష్యుడు.. ఆందోళనలో ఫ్యాన్స్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-08-02 02:20 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎన్నో అపజయాల తర్వాత ఈ హీరో రీసెంట్‌గా ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో మెగా ఫ్యామిలీ అండ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను స్వీకరించి తన ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ అఖండ విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడతో కొంతమంది కావాలనే పగబట్టారట. కాగా పవన్ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందట.

రోజు తమ బాధలు చెప్పుకోడానికి డిప్యూటీ సీఎం ను ఆశ్రయించిన వారిలో ఒకరు ఆయనపై దాడి చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా ఓ ప్రముఖ జ్యతిష్యుడు సంచలన విషయం బయటపెట్టాడు. కానీ ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన పవన్ కల్యాణ్‌ను ఎవరు ఏం చేయలేరన్నారు. ఆయనకు అన్నింటిని ఎదుర్కొనే సత్తా ఉందని..కాగా ప్రాణగండం నుంచి తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అభమానులు కూడా కేవలం సినిమా రిలీజ్ సమయంలో హంగామా చేయడం కాదు.. అన్ని వేళల్లో పవర్ స్టార్‌కు అండగా ఉంటారని ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అయిన జయశంకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ విన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News