నమ్మిన బాయ్‌ఫ్రెండ్ నట్టేటా ముంచేశాడు: ఆశాషైనీ ఆవేదన
రీసెంట్‌గా శ్రద్దా వాకర్ ఘటన దేశాన్ని కుదిపివేసింది. ఈ దారుణం తర్వాత సినిమా తారలు కూడా మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను ఖండించారు.
దిశ, సినిమా: రీసెంట్‌గా శ్రద్దా వాకర్ ఘటన దేశాన్ని కుదిపివేసింది. ఈ దారుణం తర్వాత సినిమా తారలు కూడా మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను ఖండించారు. అలాగే కొంతమంది వారి జీవితంలో ఎదురుకున్న భయంకర పరిస్థితులను చెప్పుకున్నారు. ఇక రీసెంట్‌గా టాలీవుడ్ హీరోయిన్ ఆశాషైనీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి నేను బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే అతని అసలు బుద్ధి బయటపడింది. తీవ్రంగా హింసించేవాడు. రోజు కారణం లేకుండా కొట్టేవాడు' అని చెప్పింది.
ఇవి కూడా చదవండి: