Aryan Khan and Nora Fatehi డేటింగ్‌లో ఉన్నారా?
షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, సినిమా: షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆర్యన్ తన స్నేహితులతో కలిసి దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోగా ఈ వేడుకల్లో బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆర్యన్‌తో కాస్త క్లోజ్‌గా మూవ్ అయినట్లు కొన్ని ఫొటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ నెటిజన్లు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఈమేరకు నోరా తన ఫ్రెండ్స్‌తో కలిసి బుర్జ్ ఖలీఫా వద్ద బాణాసంచా కాల్చుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా.. అదే వేదికపై ఆర్యన్ తన సోదరి, కరణ్ జోహార్‌తో కలిసి ఎంజాయ్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన పిక్స్‌ను నోరా నెట్టింట షేర్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే స్పందిస్తున్న ఫ్యాన్స్.. ఇటీవల ఓ డిన్నర్‌లోనూ ఆర్యన్‌తో కనిపించిందని, ఇప్పుడూ దుబాయ్ కూడా వెళ్లడం చూస్తే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారంటూ బలంగా వాదిస్తున్నారు.