బాలీవుడ్‌ను నాశనం చేయాలని ఫిక్స్ అయ్యారు.. 'బాయ్‌కాట్' ట్రెండింగ్‌పై అర్జున్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ‘బాయ్‌కాట్’ ట్రెండింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు.
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ 'బాయ్‌కాట్' ట్రెండింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన నటుడు ఇటీవల బాలీవుడ్ సినిమాలను టార్గెట్ చేసి నెట్టింట కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే బాలీవుడ్ ఇండస్ర నీ చాలా 'డీసెంట్' అని పేర్కొన్న ఆయన.. ఈ ట్రెండ్‌ను అంతం చేయడానికి పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నాడు.
అలాగే ఇండస్ట్రీల పరువు తీయడానికే కొంతమంది వ్యక్తులు బహిష్కరణ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇలాంటి ఎన్ని ఎదురుదెబ్బలనైనా తట్టుకుని నిలబడి ప్రజల మన్ననలు పొందుతామని ధీమా వ్యక్తం చేశాడు. చివరగా ప్రేక్షకులు తెలివైన వాళ్లంటూ పొగిడేసిన అర్జున్.. ఇంటిపేర్లను చూసి సినిమాలను ఇష్టపడటం కూడా అన్యాయంగా పేర్కొన్నాడు. ఇక ఇటీవల 'లాల్ సింగ్ చడ్డా', 'రక్షా బంధన్', 'బ్రహ్మాస్త్ర', 'డార్లింగ్స్' సినిమాలను బాయ్ కాట్ చేయాలంటూ నెట్టింట చర్చ నడిచిన సంగతి తెలిసిందే.