సెన్సార్ పూర్తిచేసుకున్న ‘ది కేరళ స్టోరీ’.. ఆ సీన్లు అన్నీ కట్!
ప్రస్తుతం దేశం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’.
దిశ, సినిమా: ప్రస్తుతం దేశం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 5న విడుదలకానుంది. అయితే తాజాగా సెన్సార్ పూర్తిచేసుకున్న సినిమాలో వివిధ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని వాటిలో మార్పులు చేయాలని సూచించారట. మొత్తంగా 10 సీన్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా దుమారం రేపిన ఓ మాజీ సీఎం ఇంటర్వ్యూ కూడా పూర్తిగా తొలగించాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది.