Taapsee Pannu కంటే నా b**bs పెద్దవి.. స్టార్ డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఎప్పుడై ఏదోక వివాదంలో ఉంటూ
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూ ఉంటాడు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు. హీరోయిన్ తాప్సీ పన్నుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా తాప్సీపై వల్గర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా మహిళపై ఇలా కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
'దోబోరా' సినిమా ఆగస్టు 19న విడుదల కానుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్ వివాదం గురించి యాంకర్ ప్రశ్నలు అడిగింది. 'మీరు కూడా రణవీర్ సింగ్ లా ట్రై చేయవచ్చుగా?' అని అనురాగ్ కశ్యప్‌ను యాంకర్ ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన.. బాలీవుడ్ లో ఇలాంటివి కామన్ అని సమాధానమిచ్చాడు.
అనురాగ్ కశ్యప్ సమాధానానికి తాప్సీ నవ్వుతూ హర్రర్ సినిమా చూపిస్తారా ఏంటి? అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే అనురాగ్ కశ్యప్.. తాప్సీ కంటే నా b**bs పెద్దగా ఉంటాయని, అందుకే ఆమెకు అసూయ అని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఊహించని ఈ సమాధానంతో యాంకర్ కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా దోబారా సినిమాకు అనురాగ్ కశ్యప్ డైరెక్టర్ గా వ్యవహరించగా... తాప్సీతో ఆయన మూడోవ సినిమా ఇది.
అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. డైరెక్టర్‌కు క్షమాపణ చెప్పిన Anupama Parameswaran