‘హగ్గులు, కిస్సులే మంచి సంస్కృతి’ కృతి సనన్‌పై మరో స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘ఆదిపురుష్’’ చిత్రం మొదటి నుంచి వివాదాల్లో నలిగిపోతుంది
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘ఆదిపురుష్’’ చిత్రం మొదటి నుంచి వివాదాల్లో నలిగిపోతుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది భక్తి పేరుతో ప్రమోషనల్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంచనాలు ఎంతో ఎత్తుకి తీసుకెళ్లగా.. దర్శకుడు, హీరోయిన్ కృతి సనన్ తిరుమల కొండపై ముద్దులు, హగ్గుల వ్యవహారంతో ఈ చిత్రంపై పాజిటివ్ ఒపినియన్ కాస్త పూర్తి నెగిటివ్‌గా మారింది. ఓం రౌత్‌పై కేసు కూడా నమోదు చేశారు. ‘‘90వ దశకంలో దేశం మొత్తం విశేష ఆదరణ పొందిన ‘రామానంద్ సాగర్’ రామాయణం సీరియల్లో ‘దీపికా చిఖిల’ సీత రోల్లో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా గౌరవ మర్యాదలు సంపాదించకున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై ఆమె స్పందించి.. ఈ జనరేషన్ నటీనటులతో ఇదే పెద్ద సమస్య.
వాళ్ళకి తాము ఎలాంటి పాత్రలో నటిస్తున్నాం అనే కనీస అవగాహన కూడా లేకుండా పోయింది. సీత లాంటి పాత్ర చేస్తున్నప్పుడు ఎంతలా లీనం అయిపోవాలి అనేది తెలియడం లేదు. అలాంటి వాళ్ళు సీత పాత్రలో నటిస్తే దానిని వాళ్ళు కేవలం ఒక పాత్రగానే.. రామాయణాన్ని జస్ట్ మూవీగానే చూస్తారు. ఆ రోల్‌పై వారికి ఎలాంటి ఎమోషన్ ఉండదు. షూటింగ్ అయిపోగానే ఒక ప్రాజెక్టు అయిపోయింది అని అనుకుంటారు. కృతి కూడా ఈ జనరేషన్ నటి కాబట్టి అలాగే బిహేవ్ చేస్తోంది అని దీపీకా ఆగ్రహం వ్యక్తం చేశారు. కిస్సులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం మాత్రమే ఇప్పటి రోజుల్లో మంచి సంస్కృతి అని ఈ తరం నటులు భావిస్తున్నారు. కృతి సనన్ ‘ఆదిపురుష్’ చిత్రంలో సీతగా నటిస్తోంది. కానీ ఆమె తనని తాను సీతగా భావించలేకుంది. మా రోజుల్లో అలా కాదు. నేను కూడా సీత పాత్రలో నటించాను కదా. నేను ఆ పాత్రలో జీవించాను. కనీసం సెట్లో కూడా మమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారు కాదు. నిజమైన దేవుళ్ళ లాగే చూసేవారు.’’అంటూ చెప్పు దీపికా చెప్పుకొచ్చారు.
Read More... అతనిపై వక్షోజాలతో దాడి చేసిన షెర్లిన్.. న్యూడ్ వీడియో వైరల్