నా అందాన్ని ప్రజలు అంగీకరించలేదు.. చాలాకాలం అభద్రతకు లోనయ్యాను

కెరీర్ మొదట్లో నా లుక్స్ గురించి అసంతృప్తిగా ఉండేవాడిని

Update: 2023-06-16 06:16 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తన నటనా జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. కెరీర్ ప్రారంభంలో తన రూపాన్ని ప్రజలు అంగీకరించలేదని చెప్పాడు. అయితే దాన్ని సీరియస్‌గా తీసుకోలేదన్న అనిల్.. ‘కెరీర్ మొదట్లో నా లుక్స్ గురించి అసంతృప్తిగా ఉండేవాడిని. నన్ను నేను అసురక్షితంగా భావించాను. ఎందుకంటే ప్రజలు నా రూపాన్ని ఎప్పుడూ అంతగా ఆదరించినట్లు అనిపించలేదు. ‘అతను మంచి నటుడు.. కానీ, అతనికి బలమైన వ్యక్తిత్వం లేదు’ అని చెప్పుకునేవారు’. దీంతో నాపై నాకే అభద్రతభావం ఉండేది’ అని తెలిపాడు. అయితే జనాలు ఎలా మాట్లాడుకున్నా తానుమాత్రం టాలెంట్, గొప్ప వ్యక్తిత్వం ముఖ్యమైనదిగా చూసేవాడినని, ఇప్పటికీ క్రమశిక్షణతో ఉండటం మాత్రమే తనకు తెలుసంటూ పలు విషయాలను ప్రస్తావించాడు.

Read More:   జనాలను పిచ్చోళ్లను చేసిన బాలీవుడ్ జంట.. బ్రేకప్ అబద్ధమేనట!

Mokshagnaకు అక్కడ భవిష్యత్తు లేదు.. వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు 


Full View


Similar News