పవర్ఫుల్ అండ్ మీనింగ్‌ఫుల్ క్యారెక్టర్లే చేస్తా: అనెరి వజని
టెలివిజన్ యంగ్ నటి అనెరి వజని తన సినీ ప్రయాణం ఆనందంగా సాగుతున్నట్లు తెలిపింది.
దిశ, సినిమా: టెలివిజన్ యంగ్ నటి అనెరి వజని తన సినీ ప్రయాణం ఆనందంగా సాగుతున్నట్లు తెలిపింది. 2012లో 'కాళి: ఏక్ పునర్ అవతార్' షోతో అరంగేట్రం చేసిన బ్యూటీ.. ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ మేరకు తన కెరీర్లో ఇప్పటివరకు శక్తివంతమైన, అర్థవంతమైన పాత్రలకు కట్టుబడి పని చేసినందుకు సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. 'ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు నా వయసు 19 ఏళ్లు. అందుకే చీర కట్టుకుని నటించేందుకు అంగీకరించలేదు.
కానీ, మీనింగ్‌ఫుల్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనుకున్నా. ఇందుకోసం ఓపికతో ఆసక్తి ఉన్న పాత్రల కోసం వెతికాను. ఈ క్రమంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎల్లప్పుడూ సొంత నిబంధనలకు కట్టుబడి ఉండాలనుకున్నా. నేను 50 షోలు చేసి ఉండకపోవచ్చు. కానీ, నేను చేసినవన్నీ సంతృప్తినిచ్చాయి. ఇప్పటికీ అదే కమిట్మెంట్తో చేయగలుగుతున్నానని చెప్పేందుకు హ్యాపీగా ఉంది' అని చెప్పింది. అలాగే సినీ పరిశ్రమ కృతజ్ఞత లేనిదన్న ఆమె.. ఇక్కడ ఒక్క పొరపాటు జరిగితే వంద పుకార్లు పట్టించి, చేయని తప్పులను మన మీదేస్తారని ఫైర్ అయింది.