కాబోయే భర్తపై యాంకర్ రష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జబర్దస్త్ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది యాంకర్ రష్మీ గౌతమ్.

Update: 2023-07-17 15:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది యాంకర్ రష్మీ గౌతమ్. ఇక ఈ ముద్దుగుమ్మ సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని నెట్టింట రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. కానీ దీనిపై ఎప్పుడూ వీరు అధికారికంగా ప్రకటించలేదు. కానీ పరోక్షంగా మాత్రం తమ ఫీలింగ్స్ పంచుకుంటారు. అయితే ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ తెగ సందడి చేస్తోంది. ఈ వారం ఎపిసోడ్‌లో తమకు కాబోయే భర్తలపై సీరియల్ నటీమణులతో సహా ఈ భామ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘నాకు కాబోయే వాడు, నేను చెప్పిందే చేయాలి. చేసిందే చెప్పాలి.’’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో వారి ఫ్యాన్స్ కొంతమంది.. ‘సుధీర్ మాత్రమే అలా చేస్తాడు. నీ మనసులో ఇంకా మా అన్న మాత్రమే ఉన్నాడు. మరోసారి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రష్మీ ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే అటు సినిమాలతోనూ అలరిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News