మామిడికాయల వేట స్టార్ట్ అయిందంటూ అనసూయ పోస్ట్.. ఆ ఎఫైర్ వల్లే ఇదంతా జరిగిందా!
అనసూయ బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చుకుంది.
దిశ, సినిమా: అనసూయ బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ఇటీవల పూర్తిగా యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పేసి నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తన నటనతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండి పలు పోస్టులు పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్ పుష్ప-2లో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే షూటింగ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయినప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేస్తూ సమ్మర్‌లో హీట్ పుట్టిస్తుంది.
తాజాగా, అనసూయ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. తన భర్త, పిల్లలు మామిడికాయలు తెంపుతుండగా ఈ హాట్ యాంకర్ వీడియో తీసింది. అది షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. ‘‘ మామిడికాయల వేట స్టార్ట్ అయింది. ఇదొక సీరియస్ ఎఫైర్’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు మామిడికాయలు తెంపుతున్నావ్ గుడ్ న్యూస్ ఏమైనా ఉందా? అని క్రేజ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే సమ్మర్ కావడంతో అనసూయ కొడుకులు తినడానికి వాళ్ల ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకి కాసిన కాయలు తెంపినట్లు తెలుస్తోంది.