వారానికి మూడు సార్లు ఆ పని ఖచ్చితంగా చేస్తా.. రోజూ అంటే కుదరదంటున్న అనసూయ

యాంకర్ అనసూయ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-07-11 03:09 GMT

దిశ, సినిమా: యాంకర్ అనసూయ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో తో క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెర మీద కూడా అలరిస్తుంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం మూవీలో రంగమ్మత్త గా కనిపించి అందర్ని షాక్ కు గురి చేసింది. ఈ పాత్ర ఆమెకు నచ్చకపోయినా చేసానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది కానీ ఆ పాత్ర ఆమెకి బాగా కలిసి వచ్చింది ఆ తర్వాత అనసూయ సినీ కెరియర్ మొత్తం మారిపోయింది. వరుస అవకాశాలతో దూసుకెళ్లింది.

ఈ మధ్యకాలంలో అనసూయ ఏం మాట్లాడినా నెటిజన్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు ఈమె అన్నది ఒక్క మాట అయితే, దాన్ని నాలుగు రకాలుగా మార్చి ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి ఎనీథింగ్ అంటూ స్టోరీ పెట్టగా నెటిజెన్స్ కొందరు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు వాటికి అనసూయ కూడా క్రేజీగా ఆన్సర్ చేసింది.

మీరు డైలీ జిమ్ చేస్తారన్న ప్రశ్నకు.. రోజూ జిమ్ చేయాలని నాకు ఉంటుంది కానీ.. ఇప్పుడున్న నా షెడ్యూల్స్ కి అసలు టైం కుదరడం లేదు.. వారానికి మూడు సార్లు ఖచ్చితంగా జిమ్ చేసేందుకు ట్రై చేస్తా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇలా ఈ అమ్మడు ఏది చెప్పినా 24 గంటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.


Similar News