క్యూట్ ఫొజులకు ఫోజులిస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన Anasuya Bharadwaj
తాజాగా హాట్ యాంకర్ అనసూయ క్యూట్ ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటికి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ జోడించింది. ‘
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా హాట్ యాంకర్ అనసూయ క్యూట్ ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటికి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ జోడించింది. ‘‘సమస్యలు అధిగమించే వరకు అవి కష్టతరంగానే అనిపిస్తాయి. కాబట్టి పట్టు వదలకుండా పోరాడుదాం.’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు ‘రాను రాను అనసూయ మరీ చిన్నపిల్లై పోతుంది. ఈ పొట్టి పొట్టి గౌన్లు ధరించడమేంటో.. ఈ నీతి వాక్యాలు చెప్పడమేంటో అంటూ రంగమ్మత్త ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడు కెరీర్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది.
ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో అయితే దారుణంగా ట్రోల్స్‌కు గురవుతుంటుంది. ‘నా బట్టలు నా ఇష్టం. జడ్జి చేయడానికి మీరెవరు? నాకు కంపార్ట్‌గా అనిపిస్తే ఎలాంటి డ్రెస్సులైనా వేసుకుంటాను’ అని ట్రోలర్స్‌కు ఎప్పటికప్పుడూ దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది.
సినిమాల విషయానికొస్తే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉంది. అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న ‘పెదకాపు’ చిత్రంలో కీలక రోల్ చేస్తుంది. ఈ మూవీ ఈ నెల (సెప్టెంబర్) 29 న విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా అనసూయ చేతిలో ఉన్నాయి.
Read More: ఫ్యామిలీతో కలిసి ఆ సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్న మహేశ్ బాబు.. (ట్వీట్)