ANASUYA-PAWAN KALYAN: ఇదెక్కడి మాస్‌రా మావా.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌తో అనసూయ ఐటెం సాంగ్

హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై యాంకరింగ్‌కు గుడ్‌బై వెండితెపై కీలక పాత్రల్లో మెరుస్తోంది.

Update: 2024-07-23 16:05 GMT

దిశ, సినిమా: హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై యాంకరింగ్‌కు గుడ్‌బై వెండితెపై కీలక పాత్రల్లో మెరుస్తోంది. ముఖ్యంగా ‘రంగస్థలం, పుష్ప’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. న్యూస్ యాంకర్ గా మొదలైన అనసూయ కెరీర్ యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐటెమ్ సాంగ్స్.. ఇలా మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకుంటోంది. అయితే అనసూయ తాజాగా ఓ షో లో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలోని జనాల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. ప్రతి శనివారం రాత్రి 9 గంటలు ప్రసారమయ్యే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రాంలో అనసూయ..

‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సాంగ్ లో స్టెప్పులేశానని, ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని తెలిపింది. ఆయనతో కలిసి డాన్స్ చేయడం నాకు చాలా గర్వంగా ఉందని, మన టెలివిజన్‌లో ఆ పాట మోతమోగిపోద్ది’ అంటూ హాట్ యాంకర్ ఓ రేంజ్‌లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పవర్ స్టార్ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు కదా.. మరీ ఏ సినిమాలో అనేది మాత్రం అనసూయ చెప్పలేదు. ఏ మూవీలో అయ్యింటుందంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక రంగమత్తతో ఐటెమ్ సాంగ్ అంటే మామూలుగా ఉండదు మరీ అంటూ యూత్ క్రేజీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News