జిమ్‌లో అనసూయ ఎలాంటి వర్కౌట్స్ చేస్తుందంటే.. ఆంటీ బ్యూటీ సీక్రెట్ ఇదేనా..?

హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వెండితెరపై సందడి చేస్తుంది.

Update: 2024-04-06 04:18 GMT

దిశ, సినిమా : హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వెండితెరపై సందడి చేస్తుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో ఆకట్టుకుంటుంది. పాజిటివ్, నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిపోతుంది. వివాదాస్పద పోస్టులతో నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతుంది. బోల్డ్ అవుట్ ఫిట్స్‌లో అభిమానులకు కనువిందు చేస్తూనే.. నచ్చనివారితో ఆంటీ అనిపించుకుని పోలీసు కేసుల దాకా వెళ్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సారి ఈ మంగమ్మత్త ఓ పాజిటివ్ పోస్ట్‌తో ఆకట్టుకుంది. ఫిట్‌నెస్ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ వీడియోతోపాటు స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చింది.

ఇద్దరు పిల్లల తల్లి అయినా ఈ బ్యూటీ ఇంత అందంగా, ఆకర్షణీయంగా ఎలా కనిపిస్తుందనేది ఈ వీడియో చూస్తే అర్థం అవుతుండగా.. జిమ్‌లో ఎందుకు వర్కౌట్ చేయాలి? చేస్తే ప్రయోజనాలు ఏంటి? అని డిటెయిల్ గా వివరించింది. అయితే దీనిపై కూడా ట్రోలింగ్ తప్పలేదు. ‘ఈ ఏజ్‌లో ఎందుకురా అను’, ‘సినిమాల్లో అవకాశాల కోసం వేస్తున్న స్టంట్స్. లేదంటే ఎందుకింత సీన్ చేయడం’, ‘ఆంటీ మీ బ్యూటీ సీక్రెట్ ఇదేనా?’ అని కామెంట్స్ పెడుతున్నారు. కానీ అభిమానులు మాత్రం బ్యూటిఫుల్, ఫ్యాబులస్ అని పొగిడేస్తున్నారు.





Similar News