గిల్లితే గిల్లించుకోవాలి.. ఇండస్ట్రీ కల్చర్‌పై Aanasuya ఫైర్

దిశ, సినిమా: స్టార్‌ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌ తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది.

Update: 2022-08-18 12:28 GMT

దిశ, సినిమా: స్టార్‌ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌ తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె.. తనపై బాడీ షేమింగ్‌ వల్లే 'జబర్దస్త్' షోను వీడినట్లు చెప్పింది. అలాగే ఇండస్ట్రీలో మహిళలను చూసే విధానం చూసి ఎన్నోసార్లు ఆవేదన చెందానన్న అనసూయ.. ఇక్కడ ఆడవాళ్లను పెద్దగా లెక్కచేయరని, ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది.

ఇక హీరోయిన్‌ అంటే 'కేవలం కెమెరా ముందు నిలబడి కాపాడండి అని అరవడం లేదా సిగ్గుపడుతూ నవ్వడమే' అన్న ఆమె.. 'పోకిరి' సినిమాలో లాగా 'గిల్లితే గిల్లించుకోవాలి' అనే డైలాగ్‌ ఇక్కడ కరెక్ట్‌గా సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక స్త్రీలు తమ హక్కుల కోసం మాట్లాడితే వెంటనే తొక్కేస్తారని, దేవదాసిలా పని చేయాలనే కోరుకుంటారని తెలిపింది. చివరగా బయటకు కనిపించే రంగుల ప్రపంచం వేరని, తెరవెనుక అందరూ అనుకున్నంత హుందాగా ఉండదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.


Tags:    

Similar News