పవన్ కల్యాణ్ తప్పకుండా సీఎం అవ్వాలి.. ‘వకీల్ సాబ్’ నటి కామెంట్స్ వైరల్

‘పవన్ కల్యాణ్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయనకు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టం.

Update: 2024-03-16 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘పవన్ కల్యాణ్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయనకు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టం. ఆయన నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు. అగ్ర హీరో హోదాను వదులుకొని రాజకీయాల్లోకి రావడం సాహసం. అలాంటి వ్యక్తికి ప్రజలు కూడా అండగా నిలబడాలి. ఆయన సీఎం అవ్వాలని నేనైతే బలంగా కోరుకుంటున్నాను’ అని యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల అన్నారు. కాగా, ప్రస్తుతం అనన్య తంత్ర అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే, రాజకీయాల్లోకి వచ్చాక సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటించింది. అయితే, తంత్ర చిత్రం విడుదల రోజున ప్రేక్షకుల రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు ఆమె ఐమాక్స్ థియేటర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ గురించి అడగ్గా.. సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.



 


Tags:    

Similar News