చనిపోయిన కొడుకుతో బిడ్డను పుట్టించిన తల్లి.. అదే చివరి కోరికంటూ

స్పానిష్ టీవీ స్టార్ అనా ఒబ్రెగాన్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తన చనిపోయిన కొడుకు ద్వారా యునైటెడ్ స్టేట్స్‌‌కు చెందిన ఓ మహిళా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపింది.

Update: 2023-04-06 12:32 GMT

దిశ, సినిమా : స్పానిష్ టీవీ స్టార్ అనా ఒబ్రెగాన్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తన చనిపోయిన కొడుకు ద్వారా యునైటెడ్ స్టేట్స్‌‌కు చెందిన ఓ మహిళా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపింది. విషయానికొస్తే.. ఒబ్రెగాన్ కొడుకు ‘అలెస్’ (అలెజాండ్రో లెక్వియో గార్సియా) 27 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో పోరాడుతూ 2020లో చనిపోయాడు. అయితే తాను బతికున్నప్పుడు ‘నాకంటూ ఓ సొంత బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురవాలనేది నా చివరి కోరిక’ అని తనతో చెప్పాడని, దీంతో తన మరణానికి ముందే అతని స్పెర్మ్‌ను న్యూయార్క్‌లో నిల్వ చేసినట్లు అనా వెల్లడించింది. ఇక ఆ బిడ్డను మోసిన తల్లి ఫ్లోరిడాలో నివసిస్తున్న క్యూబా మూలానికి చెందిన మహిళ. కాగా.. ‘ఈ అమ్మాయి నా మనవరాలు. స్పెయిన్‌లో ఒకరి బిడ్డకు మరో మహిళ జన్మనివ్వడం చట్టవిరుద్ధం అయినప్పటికీ, విదేశాలలో పుట్టిన బిడ్డను దత్తత తీసుకోవడం చట్టబద్ధం’ అని స్పష్టం చేసింది.

Tags:    

Similar News