Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్‌పై మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898’. ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి.

Update: 2024-07-21 08:31 GMT

దిశ, సినిమా: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898’. ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఒక్కో సీన్‌ను ఓ రేంజ్‌లో సరికొత్తగా చూపించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం నాగ్ అశ్విన్‌ను కొనియాడటం ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కథానాయికగా నటించగా.. మృణాల్ ఠాకూర్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ,దుల్కర్ సల్మాన్, శోభన వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు.

చరిత్ర సృష్టించిన కల్కి మూవీని వేరే లెవల్‌కు తీసుకెళ్లిన నాగ్ అశ్విన్‌ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో పాన్ ఇండియా స్టార్ ను ఎలా ప్రజెంట్ చేశారో అమితాబ్ ప్రశంసించారు. ఈ స్టోరీ కోసం ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవడం చాలా మంచి నిర్ణయమని అన్నారు. రెబల్ స్టార్‌కు ఆ పాత్ర కరెక్ట్ సెట్ అయ్యిందని.. నిజంగా దేవుడిలా ఉన్నాడంటూ పొగిడారు.

సినిమా ఫస్ట్ హాఫ్ జనాలు అర్థం చేసుకోలేకపోయారన్నారు. ఈ మూవీని అమితాబ్ ఇప్పటికే నాలుగు సార్లు చూశానని, తన కుమారుడు అభిషేక్ బచ్చన్, మనవరాలితో ఈ చిత్రం గురించి చర్చించడం ఎంతో ఉత్సాహంగా ఉందని బచ్చన్ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేయడం గ్రేట్ అని వెల్లడించారు.ఇక ప్రభాస్ వరుస బాక్సాఫీస్ వైఫల్యాల తర్వాత హిట్ గా నిలిచిన రెండవ చిత్రం కల్కి అని చెప్పుకోవచ్చు.


Similar News