మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎలోన్ మస్క్‌తో రిలేషన్‌పై స్పందించిన నటి.. పిచ్చిదాన్ని చేశాడంటూ
మాజీ బాయ్ ఫ్రెండ్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్‌తో ఇప్పటికీ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నట్లు చెబుతూ షాక్ ఇచ్చింది హాలీవుడ్ నటి అంబర్ హర్డ్.
దిశ, సినిమా: మాజీ బాయ్ ఫ్రెండ్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్‌తో ఇప్పటికీ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నట్లు చెబుతూ షాక్ ఇచ్చింది హాలీవుడ్ నటి అంబర్ హర్డ్. నటుడు, మాజీ భర్త జానీ డెప్‌తో విడాకుల ఇష్యూ తర్వాత కొంతకాలంగా సినిమాలతో పాటు మీడియా కంట పడకుండా సెలైంట్ అయిపోయింది అంబర్. అయితే ‘వాల్టర్ ఐజాక్సన్’ రాసిన ఎలోన్ మస్క్ ఆత్మకథను ఇటీవల విడుదల చేయగా ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె తమ బంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘ఇప్పటికీ ఎలోన్ మస్క్‌ను చాలా ప్రేమిస్తున్నా.
అతనిది క్రూయల్ లవ్. ఆయనెప్పుడూ ఫైర్‌ను లవ్ చేస్తాడు. అది తనను కాల్చేస్తుందని తెలిసినా వెనకడుగు వేయడు. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయన ప్రేమ కోసం ఒకప్పుడూ పిచ్చిదాన్ని అయిపోయా. అయితే మస్క్ కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులతో ప్రేమలో పడిపోతాడనేది నిజం. అవి ఎంత విషపూరితమైనవో ఎలోన్‌కు బాగా తెలుసు. అతని లైఫ్‌లోనూ చీకటి కోణం ఉంది’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.