మణిరత్నంను ఆ విషయంలో తిరస్కరించిన Amala Paul

Amala Paul REVEALS why she refused to do Mani Ratnam's Ponniyin Selvan

Update: 2022-09-13 07:46 GMT

దిశ, సినిమా: నటి అమలాపాల్ కోలీవుడ్‌లోనే కాక టాలీవుడ్‌లోనూ సుపరిచితురాలు. ఈ ఏడాది 'కడవర్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అమల.. సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటోంది. ఇదిలా ఉంటే.. లెజెండరీ డైరెక్టర్ 'పొన్నియిన్ సెల్వన్‌' మూవీలో తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో పేర్కొన్న అమలాపాల్ మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం కోసం మణి సార్ తనకు ఆడిషన్‌ నిర్వహించగా.. అప్పుడు చాన్స్ దక్కకపోవడంతో చాలా నిరాశపడ్డానని స్పష్టం చేసింది.

అయితే 2021లో మరోసారి ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చిందని.. కానీ ఆ టైమ్‌లో తన మానసిక స్థితి బాగాలేకోవడంతో 'నో' చెప్పినట్లు వెల్లడించింది. 'ఒకవేళ ఎవరైనా ఈ అవకాశం వదులుకున్నందుకు బాధపడుతున్నారా? అని నన్ను ప్రశ్నిస్తే.. లేదని స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని విషయాలు కచ్చితంగా ఉంటాయి. కచ్చితంగా రూపొందిస్తారు. వాటిని మనం ఎలా చూస్తామో.. అలా మాత్రమే ఉంటాయని నేను భావిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.

Also Read : నటిని పిచ్చికొట్టుడు కొట్టిన పనిమనిషి.. రక్షించాలని వేడుకున్న షా 

Tags:    

Similar News