అల్లు అర్జున్‌ని పెళ్లి చేసుకోవాలనుంది..మనసులో మాట బయటపెట్టిన కోవై సరళ..!!
సీనియర్ నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ఇప్పుడు అడప దడప మూవీస్‌లో కనిపిస్తుంది.
దిశ, సినిమా: సీనియర్ నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ఇప్పుడు అడప దడప మూవీస్‌లో కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్‌తో ఎంతో మందిని నవ్వించిన కోవై సరళ తన మనసులోని మాటని బయటపెట్టింది.
తాజాగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ షోకు వచ్చిన ఈమె.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మా సొంత ఊరు కోయంబత్తూర్. కోయంబత్తూర్ ని షార్ట్‌గా కోవై అని అంటారు. మా ఊరిపేరే నాకు ఇంటి పేరుగా మారిపోవడంతో నన్ను కోవై సరళ అని పిలిచేవారు’ అని చెప్పుకొస్తూ తన ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పింది. ‘పెళ్లి అవసరం ఏముంది. పెళ్లి చేసుకునే జీవించాలని కండిషన్ లేదు కదా.
అయితే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో పెళ్లి చేసుకోవాలంటే, అల్లు అర్జున్ ను చేసుకుంటానని మనసులో మాట బయటపెట్టింది. చిన్నప్పుడు తన పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారని.. తండ్రి డప్పు కొట్టి డబ్బులు సంపాదించేవారని చెప్పింది. కళామతల్లికి తన జీవితాన్ని అంకితం చేసినట్లు వివరించింది.
కాగా, ప్రస్తుతం సౌత్ లోని పలు తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటిస్తున్నట్లు కోవై సరళ తెలిపింది.