వరుణ్-లావణ్య త్రిపాఠి రిలేషన్‌పై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. త్వరలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి నుంచి వీరికి సంబంధించిన పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మొదటి సినిమా సమయంలో మంచి తెలుగబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలంటూ అల్లు అరవింద్ సలహా ఇచ్చిన వీడియో వైరలైంది.
తాజాగా ఈ వీడియో మీద అల్లు అరవింద్ స్పందించారు. ‘బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను స్ఫూర్తి గా తీసుకొని పెళ్లి చేసుకోవద్దు. వైష్ణవికి ఇంకా మంచి భవిష్యత్ ఉంది. కెరీర్ లో సెటిలైన తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేయాలని సూచించారు. అంతేకాకుండా తన బ్యానర్ లో ఓ హీరోయిన్ మూడు సినిమాలు చేసిందని, ఆ అమ్మాయిని ఇక్కడే మంచి తెలుగబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తే మా వాడినే లవ్ చేసిందని’’ చెప్పుకొచ్చారు.
Also Read: శ్రీజను పెళ్లి చేసుకోవాలి అనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?