అల్లు అర్జున్ వల్లే ట్రోల్స్ ఎదుర్కొన్నాను :Viraj Ashwin

ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Update: 2023-09-20 08:55 GMT

దిశ, సినిమా: ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రకోసం ప్రాణం పెట్టి నటించాడు. అయితే గతంలో ఈయన ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘బేబీ’తో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. దీంతో వరుస అఫర్లు వస్తున్నాయి. ఇదిలావుంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాజ్ వైరల్ కామెంట్స్ చేశాడు

‘ఇండస్ట్రీకి నేను రావాలని అనుకుంటున్న కొత్తలో ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా. అది అల్లు అర్జున్‌గారు ప్రాక్టీస్ చేసే షెడ్డు. ఇక మా మాస్టర్ నాతో ఇలా చెప్పేవాడు. ‘విరాజ్ ఇక్కడికి అల్లు అర్జున్‌గారు వచ్చి ఎలా కష్టపడేవారో తెలుసా? ఆయన ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవారు. ఒక్క స్టెప్ పర్ఫెక్ట్‌గా రాకపోతే పదేపదే ప్రాక్టీస్ చేసేవారు’ అన్నాడు. ఇదే విషయాన్ని నేను ‘బేబీ’ సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్‌గారికి చెప్పాను. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్లు ఊరికే అయిపోరు. ఆ స్థాయిలో హార్డ్ వర్క్ చేయాలన్నాడు.

ఆ తర్వాత హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే సరిపోదు. మనలో ఏ టాలెంట్ ఉందో ముందు గుర్తించాలి. దానిమీద ఫోకస్ పెట్టాలి. అప్పుడే సక్సెస్ అవుతామని తెలిపాడు. అక్కడ మా మధ్య నార్మల్‌గానే మాటలు కలిసాయి. అయితే బన్నీ మాటల వల్ల నేను చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను. చాలా బాధపడ్డాను’ అని విరాజ్ అశ్విన్ వివరించాడు.

Tags:    

Similar News