SHOCKING NEWS: తప్పతాగి మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఏకంగా 10 కుట్లు పడేలా చితకొట్టిన అల్లు అరవింద్!
మెగా అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: మెగా అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పేరుకే ఇంటి పేరు అల్లు అయినా.. అభిమానులంతా మెగా ఫ్యామిలీలో భాగంగా భావిస్తారు. మెగాస్టార్ చిరంజీవి అప్పుడే కథానాయకుడిగా ఎదుగుతోన్న సమయంలోనే.. చిరు టాలెంట్ చూసి, కచ్చితంగా ఈ అబ్బాయి జీవితంలో ఏదో సాధిస్తాడనే నమ్మకంతో అల్లు రామలింగయ్య తన కుమార్తెను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెగాస్టార్ ఇండస్ట్రీలో స్టార్ గుర్తింపు దక్కించుకుంటూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఇన్నేళ్ల వీరి దాంపత్యంలో సురేఖను ఒక్క మాట కూడా అనకుండా చూసుకుంటున్నారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా బయట కూడా.. అనోన్యంగా కలిసి మెలిసి ఉండే మెగాస్టార్ చిరంజీవి-సురేఖను ఆదర్శంగా తీసుకుంటారు. వీరి వివాహమై 45 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు చిన్న గొడవ కూడా లేకపోవడం గమనార్హం. దీనికి కారణం సురేఖ తన ఫ్యామిలీకి ఇచ్చే మర్యాద.
ఎంతో ఓపికతో ఫ్యామిలీ, పిల్లల్ని చూసుకుంటూ.. ఇటు భర్త చిరంజీవికి అన్ని విధాలుగా బిగ్ సపోర్ట్‌గా నిలుస్తుంది. ఇక తన గారాల చెల్లెలైన భర్తకు అల్లు అరవింద్ ఇచ్చే మర్యాద గురించి తెలిసిందే. బావా-బమ్మర్ధి బంధం కంటే వీరిది స్నేహ బంధమే ఎక్కువని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటారట. అలాగే మెగాస్టార్ ను ఎవరు ఏమన్నా అల్లు అరవింద్ అస్సలు ఊరుకునేవారు కాదట. అయితే గతంలో ఓ వ్యక్తి తప్పతాగి చిరును అసభ్యకరంగా మాట్లాడారట. ఒకటి రెండు సార్లు ఓపిక పట్టిన అరవింద్ ఆయన పెట్టుకున్న వాచ్ కళ్లజోడు పక్కనున్న పర్సన్కిచ్చి, పక్కకి తీసుకెళ్లి కోపం పోయేవరకు కొట్టడట. అతడికి పదికి పైగా కుట్లు కూడా పడ్డాయట. మరోసారి మెగాస్టార్ జోలికి వచ్చినా.. ఇలాంటి మాటలు మళ్లీ రిపీట్ అయినా వార్నింగ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుందని అల్లు అరవింద్ తేల్చీ చెప్పారట. ఇకపోతే ప్రస్తుతం మెగా -అల్లు ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.