పెళ్లయ్యాక హీరోయిన్స్ అందరూ అలాంటి పాత్రలే అడుగుతారు: కాజల్ పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ !
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా నటించినటు వంటి మూవీ ‘సత్యభామ’. ఈ సినిమా జూన్ 7వ ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దిశ, సినిమా: హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా నటించినటు వంటి మూవీ ‘సత్యభామ’. ఈ సినిమా జూన్ 7వ ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలకు నటుడు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాజల్ గురించి బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాజల్ నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ చాలా బాగుందని ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి నటిస్తారని, ఇప్పటివరకు కాజల్ నటించిన అన్ని పాత్రలలో ఈమె పరకాయ ప్రవేశం చేసి మరి నటించారని తెలిపారు. ఇక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడమే కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక చాలామంది హీరోయిన్లు పెళ్లి అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అవకాశాలు అందుకుంటారు.
కానీ కాజల్ మాత్రం హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేస్తున్నారని తెలిపారు. ఆమె ఎనర్జీ లెవెల్ కి హాండ్స్ ఆఫ్ చెప్పాలి తన సినిమాలన్నింటిని చూస్తున్నాను తనతో నటించాలని ఎప్పుడూ అనుకునేవాడిని ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. భగవంత్ కేసరిలో మేము కలిసి పని చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని బాలయ్య చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.