ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయిన అలియా..
దిశ, సినిమా : బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, నాగార్జున తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, నాగార్జున తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఇటీవలే గర్భందాల్చిన అలియా.. ఈ పరిస్థితుల్లోనూ ప్రమోషన్స్ ఈవెంట్స్ అన్నింటికీ హాజరవుతూ వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది.
ఇదే క్రమంలో అలియా, రణ్‌బీర్ రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహా కాళేశ్వరాలయాన్ని దర్శించగా.. సంప్రదాయ దుస్తుల్లో ఎంతగానో ఆకట్టుకుంది అలియా. నెత్తిన కొప్పు, కొప్పు చుట్టూ పూలతో చాలా క్యూట్‌గా కనిపించింది. ఇక ఈ లుక్ చూసిన అభిమానులు.. అలియా ప్రెగ్నెన్సీ గ్లో గురించి ప్రశంసించారు.
Also Read : అర్ధనగ్నంగా పోజులిస్తూనే.. నెటిజన్లపై బోల్డ్ బ్యూటీ ఆగ్రహం
Also Read : U/A సర్టిఫికెట్ పొందిన 'బ్రహ్మాస్త్ర'.. భారీ వసూళ్లు పక్కా అంటున్న మేకర్స్