నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా ఆ పని చేశా.. Alia Bhatt ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, హీరో రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, హీరో రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అయితే కూతురు పుట్టినకానుండి ఆలియా భట్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో జరిగిన సంఘటనల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హాలీవుడ్‌లో ఈ అమ్మడు నటిస్తున్న సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. త్వరలోనే థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆలియా భట్ మాట్లాడుతూ.. హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాకపోవడంతో వాటిని మళ్ళీ షూట్ చేయాలి అన్నారు. ఈ విషయం నాకు ప్రెగ్నెన్సీ వచ్చాక చెప్పారు. పెళ్లి తర్వాత నేను ఈ సినిమా షూట్‌లో పాల్గొన్నాను. ఇది నా మొదటి హాలీవుడ్ మూవీ కాబట్టి వదులుకోవాలనుకోలేదు. అందుకే ప్రగ్నెన్సీ వచ్చినా కూడా షూట్‌కి వెళ్ళాను. పోర్చుగల్‌లో ఆ షూట్ చేశారు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చిత్ర యూనిట్ నాకు అన్ని సౌకర్యాలు అమర్చారు. ఇది నా మొదటి యాక్షన్ సినిమా అందుకే వదులుకోకూడదని ప్రెగ్నెంట్ అని తెలిసినా సినిమా చేశాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read more:
శ్రీజ జాతకంలో అలా ఉందా.. నాలుగు పెళ్లీలు జరిగితే బకరాలు అయ్యేది ఆ ఇద్దరేనంట
Mega Princess కు ఘనస్వాగతం.. అందరికీ థాంక్యూ చెప్తూ కూతురు ఫొటో షేర్ చేసిన Upasana