నా లైఫ్ ఇలా మారడానికి ఆ ముగ్గురే కారణం.. అలియా కామెంట్స్ వైరల్
బాలీవుడ్ నటి అలియా భట్ తన కెరీర్‌పై ముగ్గురు స్టార్ల ప్రభావం ఉందంటోంది.
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అలియా భట్ తన కెరీర్‌పై ముగ్గురు స్టార్ల ప్రభావం ఉందంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే సంజయ్‌లీలా బన్సాలీ, కరణ్‌జోహార్, షారుఖ్‌ఖాన్ ఈ ముగ్గురూ తన మెంటర్స్ అని చెప్పింది. ‘ఈ ముగ్గురి ప్రభావం నా జీవితంపై బలంగా ఉంది. ‘గంగూభాయ్’ కోసం తొలిసారి సంజయ్‌లీలా బన్సాలీగారితో పనిచేశాను. ఆయన సెట్లోకి వెళితే, వేరే ప్రపంచంలోకెళ్లిన ఫీలింగ్. కెమెరా ముందు ఏమైనా చేయగలమన్న క్లారిటీ వచ్చేస్తుంది. ధైర్యంగా నటించవచ్చు అనే భరోసా కలుగుతుంది. ఆయన అలా మాయచేసేస్తారు. ‘గంగూభాయ్’ నిర్మాణంలో ఉన్నప్పుడు సంజయ్సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కరణ్ జోహార్ నుంచైతే ఎదుటివారిని గౌరవించే విధానం నేర్చుకున్నా. అంతేకాదు సబ్జెక్ట్‌పై అవగాహ పెంచుకునే విధానం ఎలాగో తెలుసుకున్నాను. సెట్లో అందరితో ఎలా కలిసిపోవాలి. పాత్రను ఎలా అర్థం చేసుకోవాలని అనేది షారుఖ్‌ని చూసి నేర్చుకున్నా. అలా వీరంతా నాపై బలమైన ప్రభావమే చూపించారు’ అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.