‘అలయా’తో అంత ఈజీ కాదు! కష్టమైన ఫీట్స్‌తో రెచ్చిపోయిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటి పూజా బేడీ కూతురు, ప్రముఖ హిరోయిన్ అలయా ఫర్నిచర్‌వాలా తన ఫిట్నెస్తో కుర్రకారును పిచ్చేకిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ నటి పూజా బేడీ కూతురు, ప్రముఖ హిరోయిన్ అలయా ఫర్నిచర్‌వాలా తన ఫిట్నెస్తో కుర్రకారును పిచ్చేకిస్తోంది. ముద్దుగా తనని ‘అలయా ఎఫ్’ అని కూడా పిలుస్తుంటారు. అయితే, అలయా ఎఫ్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చురుకుగా ఉంటున్నారు. యోగ, వర్కవుట్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కారణం.. ఆమె చేసే వర్కవుట్స్ చాలా కష్టతరమైనవి అని చెప్పుకోవచ్చు. జిమ్ బాల్పైకి దూకి.. బాల్‌పై బ్యాలెన్స్ చేస్తూ డంబెల్స్ కొట్టే ప్రయత్నం చేస్తోంది. మధ్యలో బ్యాలెన్స్ తప్పి కింద పడుతూ నొప్పిని భరిస్తోంది. ట్రైనర్ సమక్షంలో అలాంటి కష్టతరమైన ఫీట్స్‌తో ఈ ముద్దుగుమ్మ ఫిట్నెస్ శిక్షణ సెషన్ వీడియోలు నెటిజన్లతో పంచుకున్నది. వీడియో వైరల్ కావడంతో ప్రియాంక చోప్రా లాంటి నటులు సైతం ప్రశంసలు తెలుపుతున్నారు.
కాగా, తాను ఇటీవల విడుదలైన శ్రీకాంత్ అనే బాలీవుడ్ సినిమా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అలయా ఎఫ్ గురించి చెప్పాలంటే తన తాతయ్య కబీర్ బేడీ నుంచి అమ్మ పూజా బేడీ వరకు అందరూ పేరుమోసిన నటులే. 2020 లో వచ్చిన హాస్య చిత్రం జవానీ జానేమన్ తో అరంగేట్రం చేసిన ఆమెను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు అవార్డు వరించింది. అదే ఏడాది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ కేటగిరిలో 42 వ స్థానంలో నిలిచింది.