మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్న అక్కినేని కుటుంబం

దిశ, సినిమా: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోతో ఒక హీరోయిన్ నటిస్తే, మిగిలిన మెగా హీరోలు కుడా ఆ హీరోయిన్‌తోనే కలిసి పని చేసేవారు.

Update: 2022-05-28 13:39 GMT

దిశ, సినిమా: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోతో ఒక హీరోయిన్ నటిస్తే, మిగిలిన మెగా హీరోలు కూడా ఆ హీరోయిన్‌తోనే కలిసి పని చేసేవారు.ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ వీరిద్దరితో హీరోయిన్ కాజల్, తమన్నా నటించారు. వీరిలో కాజల్ అయితే చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తాన్ని రౌండప్ చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అక్కినేని సోదరులు కూడా అదే కోవలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

ఎందుకంటే ఇటీవల హాట్ బ్యూటీ నిధి అగర్వాల్.. నాగ చైతన్యతో 'సవ్యసాచి' చిత్రంలో జత కట్టిన తర్వాత 'మిస్టర్ మజ్ను' మూవీలో అఖిల్‌తో కలిసి నటించింది. తర్వాత పూజా హెగ్డే నాగ చైతన్యతో ఒక 'లైలా కోసం' సినిమాలో కనిపించగా.. ఇటీవల ఆమె అఖిల్‌తో పాటు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌' సినిమాలో తళుక్కుమంది. ఇక ముచ్చటగా మూడోసారి ముంబైకి చెందిన మోడల్ సోషల్ మీడియా సాక్షి వైద్య అనేక టీవి ప్రకటనల్లో కనిపించింది. అయితే అఖిల్ తన రాబోయే చిత్రం 'ఏజెంట్‌'లో హీరోయిన్‌‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య తన తదుపరి చిత్రంలో కూడా హీరోయిన్‌గా సాక్షి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ సాక్షి ఈ సినిమాలో చేయకుంటే.. ఆమె స్థానంలో పెళ్లి సందడి ఫేమ్ 'శ్రీలీల'నటించే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News