Akira: రామ్‌చరణ్ RC16 లో అకీరా కనిపించనున్నాడా..?బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందేనంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ అగ్ర హీరో.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కుమారుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-10-02 02:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కుమారుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. స్క్రీన్‌పై పవర్ స్టార్ తనయుడ్ని చూడాలని చాలా ఆసక్తితో ఉన్నారు. అయితే అకీరా వెండితెరకు ఎంట్రీ ఇవ్వడం పక్కా.. కానీ ఎప్పుడు ఇస్తాడనేది జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అకీరా సినీ ఎంట్రీపై జోరుగా చర్చించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సోషల్ మీడియా టాక్ ప్రకారం.. రామ్ చరణ్ RC16 తో అకీరా ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్ ఇవ్వనున్నాడంటూ మాట్లాడుకుంటున్నారు.

ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. అకీరా అండ్ గ్లోబల్ స్టార్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్ బద్దలవ్వాల్సిందే అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే ఇక. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్ ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర యాస మాట్లాడనున్నారని సమాచారం. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కలయికలో త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారట. ఇది ఒకప్పటి మల్లయోధుడి కోడి రామ్మూర్తి బయోపిక్ అని నెట్టింట టాక్ నడుస్తోంది.


Similar News