నాన్న దర్శకత్వంలో అస్సలు నటించను.. లవ్ ఎఫైర్స్ బయటపెట్టిన ఆకాష్ పూరి?

గబ్బర్ సింగ్, చిరుత లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి.

Update: 2024-03-10 15:38 GMT

దిశ, సినిమా: గబ్బర్ సింగ్, చిరుత లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. బజార్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. తాజాగా ఆకాష్ పూరి ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీ నాన్న దర్శకత్వంలో ఎప్పుడు సినిమా చేయబోతున్నావని ప్రశ్నించగా..

‘‘నేను మా నాన్న దర్శకత్వంలో సినిమా చేయను. ఇదే నా నిర్ణయం. ఫస్ట్ నేను నటుడిగా, ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి. ఈ తర్వాతే ఆయన దర్శకత్వంలో ఒక పెద్ద సినిమా చేస్తాను. మా నాన్న డైరెక్షన్ చేయాలని లేదు. కార్తికేయ 2, హనుమాన్, వంటి గొప్ప గొప్ప మూవీల్లో నటించాలని కోరిక ఉంది. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాననే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయ్యాక విలన్ వంటి పాత్రలు చేయడం గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం అయితే నేను సింగిల్ గానే ఉన్నాను. ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవు’’ అని ఆకాష్ పూరి చెప్పుకొచ్చాడు.


Similar News