ఎలివేటర్లంటే చెప్పలేనంత భయం: Ajay Devgn

బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్‌గన్‌కు ఎలివేటర్లంటే చెప్పలేనంత భయం అంటున్నాడు.

Update: 2022-11-28 13:41 GMT
ఎలివేటర్లంటే చెప్పలేనంత భయం: Ajay Devgn
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్‌గన్‌కు ఎలివేటర్లంటే చెప్పలేనంత భయం అంటున్నాడు. గత కొన్నేళ్లుగా ఎక్కడికెళ్లినా లిఫ్ట్ యూజ్ చేయట్లేదని, ఎన్ని అంతస్తులైనా మెట్లపై నుంచి వెళుతున్నానని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తను నటించిన 'దృశ్యం 2' ఇటీవల విడుదలై 100కోట్ల క్లబ్‌లో చేరుతుండగా.. ఈ హీరో తాజాగా టబుతో కలిసి కపిల్ శర్మ షోలో అలరించాడు. 'ఒకసారి నేను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు అది మూడో లేదా నాల్గవ అంతస్తు నుంచి బేస్‌మెంట్‌కి దూసుకువచ్చింది. దీంతో అందులో ఉన్నవాళ్లమంతా ఒకటిన్నర గంటలకు పైగా లిఫ్ట్‌ లోనే ఇరుక్కుపోయాం. అప్పటినుంచి ఎలివేటర్లను 'క్లాస్ట్రోఫోబిక్‌'గా భావిస్తున్నా. ఎక్కడికి వెళ్లినా మెట్లను మాత్రమే వాడుతున్నా' అంటూ ఫన్నీగా వివరించాడు.

ఇవి కూడా చదవండి : అవును నిహారికను వదిలేసి చాలా రోజులైంది: స్టార్ సింగర్

Tags:    

Similar News