భర్తతో Aishwarya Rai విడాకులు.. ఒక్క పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిన అభిషేక్ బచ్చన్!

ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న తర్వాత ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

Update: 2024-01-29 04:04 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న తర్వాత ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇప్పటికే పెళ్లి తర్వాత విడిపోయి ఎవరి జీవితం వారు చూసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అందుకే విడివిడిగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఎప్పుడూ తీయకుండా పెట్టుకునే పెళ్లి ఉంగరం ధరించకుండానే అబిషేక్ ఇటీవల ఓ ఈవెంట్‌కు వచ్చారట. దీంతో అందరూ వీరిద్దరు విడాపోతున్నారు కాబట్టే అలా చేశాడని వాధించారు.

ఈ క్రమంలో.. తాజాగా, అభిషేక్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ లైఫ్ ఫెల్యూర్ పోస్ట్ పెట్టి విడాకులపై హింట్ ఇచ్చాడు. ‘‘ పరాజయ భయం కలలను నాశనం చేస్తుంది. కానీ ఆ ఓటమి నుంచి నేర్చుకుంటే కలలు నిజమవుతాయి’’ అని అభిషేక్ రాసుకొచ్చాడు. దీంతో ఈ జంట విడాకుల వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఐశ్వర్య, అభిషేక్ విడాకులు ప్రకటించే దశలోనే ఉన్నారని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ వార్తలు చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.



 


Tags:    

Similar News