పెళ్లికి ముందే ఆ హీరోతో రిలేషన్.. అబార్షన్ చేయించుకున్న ఐశ్వర్యరాయ్.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా..
దిశ, వెబ్‌డెస్క్: ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా.. అనతి కాలంలోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. పాత్రకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లే ఎంచుకుంటూ జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తుంది. అయితే.. ఐశ్వర్య రాయ్ పెళ్లికి ముందే బాలీవుడ్ అగ్రహీరోతో ఎఫైర్ ఉందంట. అతని కారణంగా ప్రెగ్నెంట్ కూడా అయితే అబార్షన్ చేయించుకుందట ఐశ్వర్య.
1999 నుంచి నటుడు సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారని ఐశ్వర్యపై ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2002లో వీరిద్దరూ విడిపోయారట. తన గురించి అసభ్యంగా మాట్లాడి తనను అవమానించినందుకే ఆయనతో విడిపోయానని ఐశ్వర్య చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్ వచ్చింది. ఆ తర్వాత ధూమ్2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యతో ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న వారు నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి.. 20 ఏప్రిల్ 2007న బంట్ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఓ పాపతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఐశ్వర్య. అయితే.. ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్‌తో రిలేషన్లో ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయి.. అబార్షన్ చేయించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ హాట్‌గా వైరల్ అవుతుంది.
Read More: అసలు ఆయనకు అది లేదు.. అందుకే విడాకులు తీసుకున్న.. నటి కామెంట్స్