కృష్ణంరాజు మృతిపై AIG ఆస్పత్రి ప్రకటన.. అసలు కారణం అదే!

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపై ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. గతేడాది కృష్ణంరాజు కాలుకు సర్జరీ జరిగిందని అన్నారు.

Update: 2022-09-11 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపై ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. గతేడాది కృష్ణంరాజు కాలుకు సర్జరీ జరిగిందని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన పోస్ట్ కొవిడ్ సమస్యతో ఆసుపత్రిలో చేరారని, కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరినప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించామని తెలిపారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి- నెబ్యులైజ్డ్ ఇన్హేలర్లపై క్రానిక్ బ్రోన్కైటిస్ ఉన్నాయని వైద్యులు ఆయన మరణానికి కారణాలపై ప్రకటన విడుదల చేశారు. కాగా, ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. ఏపీ నుంచి ఎంపీగా గెలిచారు.

Also Read : టాలీవుడ్ లో తీవ్ర విషాదం... రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత..


Tags:    

Similar News