ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. అందుకే బుల్లితెర నటి శిరీష భర్తకు విడాకులు ఇచ్చిందా?

ఈ మధ్య వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో భారీ భారీ డైలాగులు చెప్పిన వారు సైతం అనంతరం విడాకులు తీసుకుని విడిపోయి చెప్పినంత సులువు కాదు అంటూ నచ్చ చెబుతున్నారు.

Update: 2024-05-19 06:05 GMT

దిశ, సినిమా: ఈ మధ్య వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో భారీ భారీ డైలాగులు చెప్పిన వారు సైతం అనంతరం విడాకులు తీసుకుని విడిపోయి చెప్పినంత సులువు కాదు అంటూ నచ్చ చెబుతున్నారు. ముఖ్యంగా సినీ, టీవీ ఇండస్ట్రీలో అయితే తరచూ విడాకులు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా బుల్లితెర నటి శిరీష సైతం.. తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

‘మొగలిరేకులు’ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిరీష బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్‌లో నటించే ఛాన్స్ అందిపుచ్చుకుంది. మొగలిరేకులు, స్వాతిచినుకులు,రాములమ్మ, మనసు మమత, కాంచన గంగ, నాతిచరామి, చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శిరీష.. నవీన్ వల్లభనేనిని పెళ్లి చేసుకుంది. కాగా ఈ జంటకు శ్రీ ఈష్ అనే బాబు కూడా ఉన్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా శిరీష తన భర్తతో విడాకులు తీసుకుంటున్న అని ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఓ స్టార్ హీరో వల్లే ఆమె తన భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినట్లు తెలుస్తుంది. శిరీష ఓ సీరియల్ స్టార్ హీరోతో లవ్ లో ఉండటం చేతనే తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. గతంలో జీ తెలుగు స్టేజ్ పై తన భర్త పై ఉన్న ప్రేమను ఎంత స్పష్టంగా పలకబోసిందో మనందరం చూసాం. అటువంటిది ఇప్పుడు ఒక్కసారిగా తన భర్తతో విడిపోయేసరికి ప్రతి ఒక్కరూ ఎందుకు విడిపోయింది అనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టగ ఈ భామ ఓ సీరియల్ స్టార్ హీరో తో లవ్ లో పడినట్లు బయటపడింది. కానీ ఆ సీరియల్ స్టార్ హీరో ఎవరో మాత్రం తెలియలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Similar News