" టాప్ గేర్ " ట్రైలర్ విడుదల చేసిన రవితేజ !

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం " టాప్ గేర్ ".

Update: 2022-12-18 09:24 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం " టాప్ గేర్ ". కె.శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రవితేజ చేతులమీదుగా లాంచ్ చేశారు. దీంతో పాటు ఈ మూవీ డిసెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'టాప్ గేర్' మూవీ విభిన్నమైన థ్రిల్లర్ అని చెప్పడానికి ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మంచి థ్రిల్లింగ్ రైడ్‌తో ప్రమాదంలో ఉన్న క్యాబ్ డ్రైవర్‌గా ఆది కనిపించాడు. దీంతో ఆది పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కెవి శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Tags:    

Similar News