‘అతడు నాతో అసభ్యకరంగా బిహేబ్ చేశాడు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

తాజాగా హిందీ నటి తిలోత్తమ ఓ ఇంటర్వ్యూకు హాజరై తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.

Update: 2024-07-27 08:35 GMT

దిశ, సినిమా: తాజాగా హిందీ నటి తిలోత్తమ ఓ ఇంటర్వ్యూకు హాజరై తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. త్రిభువన్ మిత్రా సీఎ టాపర్ అనే శృంగార సీన్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో మానవ్ కౌల్, తిలోత్తమ ముఖ్య పాత్రల్లో నటించారు. లస్ట్ స్టోరీస్-2, దీ మీడియం, అంగ్రేజీ మీడియం వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇదంతా పక్కన పెడితే.. తిలోత్తమ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘‘వింటన్ సీజన్‌లో ఓ రోజు సాయంత్రం సమయంలో బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. చీకటి పడింది అయినప్పటికీ బస్సు రావడం లేదు. సరిగ్గా అదే సమయానికి నా ఎదురుగా ఓ కారు వచ్చి ఆగింది. దీంతో భయపడి వెంటనే బస్టాప్ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్లాను. ఆ కారులో నుంచి ఆరుగురు కుర్రాళ్లు దిగారు. వారిని అసభ్యకరంగా తిట్టాను. తర్వాత మరో కారు వస్తే లిఫ్ట్ అడిగి ఎక్కాను. ముందు సీటులో కూర్చున్నాను. ఓకే కంఫార్ట్‌గా ఉంది.. సేఫ్‌గా వెళ్లొచ్చు అనుకునే టైమ్‌కే పక్కనున్న వ్యక్తి మిస్ బిహేవ్ చేశాడు.

ఆయన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి, బలవంతంగా నా హ్యాండ్ తీసుకుని ప్రైవేటు పార్ట్ వద్ద టచ్ చేశాడు. నేను వెంటనే బలవంతంగా నా చేయిని వెనక్కి లాక్కున్నాను. ఒక్కసారిగా చాలా భయపడిపోయాను. ఈ ఘటన గురించి పేరెంట్స్‌కు చెబితే బాధపడతారని ఆ రోజు రాత్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. ఇలాంటి వారిని నేను అస్సలు ఇష్టపడను. చిన్నపిల్లల్ని ఇలా చేస్తే.. వారు ఇలాంటి వాటికి అనుకరిస్తే బాల్యం పోయినట్లే’’ అంటూ తిలోత్తమ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Tags:    

Similar News